భారతదేశం, ఆగస్టు 18 -- తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను అందించింది. టెట్(TET) ఉత్తీర్ణత సర్టిఫికెట్లను మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో అభ్యర్థులు నేరుగా టెట్ అధికారిక వెబ్‌సైట్ నుండి ఫలితాలు, డిజిటల్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఉండేది. కానీ తొలిసారిగా ఈ విధానంలో మార్పులు చేస్తూ మీసేవ ద్వారా అధికారిక ధ్రువపత్రాలను అందజేయనున్నారు.

ఈ కొత్త విధానం ద్వారా అభ్యర్థులకు అత్యంత సురక్షితమైన సెక్యూరిటీ ఫీచర్స్‌తో కూడిన ఒరిజినల్ సర్టిఫికెట్లు లభిస్తాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. టెట్ పాస్ అయిన అభ్యర్థులతో పాటు ఫెయిల్ అయిన వారికి కూడా వారి ఫలితాల ధ్రువపత్రాలను మీసేవలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ సర్టిఫికెట్ పొందేందుకు అభ్యర్థు...