భారతదేశం, జూన్ 6 -- TG TET Hall Tickets 2026 : తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు విద్యాశాఖ కీలక అప్‌డేట్ అందించింది. రాష్ట్రంలో నిర్వహించబోయే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

టీజీ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూన్ 9 నుంచి విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ సందర్శించి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డ్‌లను పొందవచ్చు. పరీక్షా కేంద్రం, సమయం, మార్గదర్శకాలకు సంబంధించిన పూర్తి వివరాలు హాల్ టికెట్‌లో ఉంటాయి.

ఈ ఏడాది టెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు....