భారతదేశం, ఏప్రిల్ 30 -- TG TET 2026 Online Application : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే జూన్ సెషన్‌కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో (ఏప్రిల్ 30, గురువారం) ముగియనుంది. ఇప్పటికే లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా,.చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకముందే ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు అభ్యర్థులను కోరుతున్నారు.

విద్యాశాఖ విడుదల చేసిన టెట్ షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 15వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ (ఏప్రిల్ 30) రాత్రి 11:59 గంటల వరకు ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు సమర్పించేందుకు వీలుంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకునేందుకు ) ఏప్రిల్ 29 నుంచే అవకాశం కల్పించారు. ఈ ఎడిట్ ఆప్షన్ మే 3వ తేదీ వరకు అందుబాటులో ...