భారతదేశం, ఆగస్టు 29 -- Telangana SSC Original Marks Memo 2026 : తెలంగాణలో పదో తరగతి పూర్చి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక అప్‌డేట్ అందించింది. టెన్త్ ఒరిజినల్ మార్కుల జాబితాల (లాంగ్ మెమోలు) పంపిణీ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ మేరకు పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లను నేరుగా సంబంధిత పాఠశాలలకే పంపిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే. లింగయ్య శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

వార్షిక పరీక్షలతో పాటు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులందరి ఒరిజినల్ మెమోలను విద్యాశాఖ సిద్ధం చేసింది. శనివారం నుంచే ఈ సర్టిఫికెట్లను అన్ని బడులకు రవాణా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. విద్యార్థులు తమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను (హెచ్‌ఎం) నేరుగా సంప్రదించి. తమ ఒరిజినల్ లాంగ్ మెమోలను పొందవచ్చని సూచ...