భారతదేశం, నవంబర్ 27 -- Telangana SSC Exams 2027 : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదోతరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులకు విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించే గడువును పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు నవంబరు 26తో ముగిసింది. ఇప్పుడు ఆ గడువును డిసెంబరు 2 వరకు పెంచుతూ గురువారం ప్రకటన జారీ చేసింది.

పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి పొడిగించబోమని ప్రభుత్వ పరీక్షల విభాగం స్పష్టం చేసింది. హెచ్‌ఎంలు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందే ఫీజులు చెల్లించాలి. అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లోని స్కూల్ లాగిన్ ద్వారా సైబర్ ట్రెజరీ ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ పద్ధతిలో మాత్రమే ఫీజు కట్టాలి. IFMIS పోర్టల్ చలాన్లు లేదా మాన్యువల్ బ్యాంక్ చలాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించర...