భారతదేశం, నవంబర్ 16 -- Telangana SSC Exam Fee Due Dates : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక అప్‌డేట్ ఇచ్చింది. మార్చి 2027లో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను పొడిగించింది.

తాజా ఆదేశాల మేరకు... రెగ్యూలర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు ట్రెజరీ ఆన్‌లైన్ ఇంటిగ్రేషన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు ఈ సవరించిన తేదీలు వర్తిస్తాయి. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ తక్షణమే ఈ విషయాన్ని విద్యార్థులందరికీ తెలియజేయాలని అధికారులు ఆదేశించారు.

రూ.500 ఆలస్య రుసుముతో అయితే విద్యార్థులు 23-12-2026 నుంచి 04-01-2027 వరకు హెచ్‌ఎంకు ఫీజు చెల్లించునేందుకు అవకాశం ఉంటుంది. ఈ గడువు పొడిగింపు అవకాశాన్ని మిగిలిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స...