భారతదేశం, జూలై 20 -- Telangana Smart Ration Cards : రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించనుంద. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్‌లో జరిగే అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా పాల్గొని ఈ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం ఏకకాలంలో జరుగుతుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే అధికారికంగా తేదీలను ప్రకటించాల్సి ఉంది.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా రేషన్ సరకులు అందించడ...