భారతదేశం, మార్చి 10 -- తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్ - 2025) ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. పరీక్షలు నిర్వహించి 2 నెలలు దాటినప్పటికీ. ఇంకా రిజల్ట్స్ ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని. వెంటనే ఫలితాలను ప్రకటించాలని పరీక్ష రాసిన అభ్యర్థులు కోరుతున్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అర్హత సాధించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ గతేడాది డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో టీజీ సెట్ - 2025 పరీక్షలు నిర్వహించింది. మొత్తం 29 సబ్జెక్టులకు సంబంధించిన ఈ పరీక్షను 18 కేంద్రాల్లో వీటిని నిర్వహించగా. సుమారు 80 శాతం మంది పరీక్ష రాశారు.

టీజీ సెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్లను త్వరగానే ప్రకటించారు. జనవరి నెలలో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రాథమిక కీలపై అభ్యంతరాల...