TG SET Notification 2026 : త్వరలోనే తెలంగాణ సెట్ నోటిఫికేషన్ - కొత్త అప్డేట్ ఇదే
భారతదేశం, మార్చి 24 -- రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెట్ నిర్వహిస్తుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. వచ్చే మే నెలలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
మే నెలలో సెట్ నోటిఫికేషన్ ఇవ్వగా. ఆ తర్వాత దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన రాత పరీక్షలను అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఏడాది కూడా టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
మరోవైపు గతేడాదిలో నిర్వహించిన తెలంగాణ సెట్ - 2025 ఫలితాలు ఇటీవలనే విడుదలయ్యాయి.. ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. కేటగిరీల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను పేర్కొన్నారు.
Published by HT Digital Content...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.