భారతదేశం, సెప్టెంబర్ 25 -- Telangana SET Hall Tickets 2026 : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం నిర్వహించే 'తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్' (TG SET 2024) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ ఏడాది టీజీ సెట్ పరీక్ష బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (CBT) ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ ప్రభుత్వ గుర్తింపు కార్డును (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లేదా ఓటర్ ఐడీ) తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.

పరీక్ష సమయానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారు సూ...