భారతదేశం, నవంబర్ 28 -- తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీజీ సెట్-2026) ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. సెప్టెంబరు 28, 29, 30 తేదీల్లో 29 సబ్జెక్టులకు ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు. అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మోలుగరం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ ఎస్. జితేంద్ర కుమార్ నాయక్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానంద రావు, టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ సహా ఇతర అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు.

పరీక్ష ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించినందుకు టీజీ సెట్ బృందాన్ని వీసీ అభినందించారు. అంకితభావంతో పనిచేసి పరీక్షను విజయ...