TG SET 2026 Exam Schedule : తెలంగాణ సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - సబ్జెక్టుల వారీగా వివరాలివే
భారతదేశం, సెప్టెంబర్ 14 -- TG SET 2026 Exam Schedule : తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల అర్హత కోసం నిర్వహించే 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (టిజి-సెట్ 2026) సబ్జెక్టుల వారీ పరీక్షల షెడ్యూల్ను ఉస్మానియా యూనివర్సిటీ అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 29 సబ్జెక్టుల్లో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయి.
ఈ సారి కూడా TG-SET పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT Mode) నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాల వివరాలను హాల్ టికెట్లలోనే పొందుపరుస్తామని ఆయన తెలిపారు.
Published by HT Digital Cont...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.