భారతదేశం, ఆగస్టు 31 -- Telangana SET Online Applications 2026 : విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లుగా అర్హత సాధించేందుకు నిర్వహించే 'తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్' ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరటనిస్తూ దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని నిర్వహణ అధికారులు స్పష్టం చేశారు.

అభ్యర్థులు టీజీ సెట్ అధికారిక వెబ్‌సైట్‌లు https://tgset.aptonline.in/ లేదా https://telanganaset.org/ సందర్శించి వెంటనే తమ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వా...