భారతదేశం, సెప్టెంబర్ 5 -- TG SET 2026 Applications : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మరియు లెక్చరర్లుగా అర్హత సాధించడానికి నిర్వహించే 'తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష' (TG SET - 2026) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షకు ఎలాంటి ఆలస్య రుసుము (Late Fee) లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 5, 2026 (నేడు) చివరి తేదీ. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి నిమిషంలో వచ్చే సాంకేతిక సమస్యల బారిన పడకుండా వెంటనే https://telanganaset.org/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

ఒకవేళ అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లయ్ చేసుకోలేకపోతే, అదనపు రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

రూ. 1500 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 6 నుండి సెప్టెంబర్ 8 వరకు, రూ....