భారతదేశం, అక్టోబర్ 3 -- ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు రోజూ ఉదయమే పోషకాలతో కూడిన టిఫిన్ అందించే బృహత్తర కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు రెండు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో హరేకృష్ణ ఫౌండేషన్‌తో ఈ సంస్థలు కీలక అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నాయి.

నాగర్‌కర్నూల్‌లో నిర్మించే సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం 'జున్నా సోలార్ సిస్టమ్స్' సంస్థ రూ. 5.17 కోట్ల భారీ చెక్కును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు అందించింది. ఈ కార్యక్రమంలో జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈఓ అనిల్ బాబు పాల్గొన్నారు....