భారతదేశం, మే 26 -- Telangana ePass Scholarship 2026 : తెలంగాణలోని బోధన ఫీజులు, ఉపకార వేతనాల దరఖాస్తులకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చేసింది. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఉపకారవేతనాలు, బోధన ఫీజుల (ఫీజు రీయింబర్స్‌మెంట్) కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి సర్కార్ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 31వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, అలాగే దివ్యాంగులైన విద్యార్థులందరూ ఈ పొడిగించిన గడువును ఉపయోగించుకోవచ్చు. సాంకేతిక ఇబ్బందుల వల్ల గతంలో దరఖాస్తులు పూర్తి చేయలేకపోయిన వారికి ఇది పెద్ద ఉపశమనం కానుంది.

రాష్ట్రవ్యాప్తంగా బోధన ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు మొత్తం 10,89,265 మంది ఉన్నట్లు అధికారు...