భారతదేశం, మార్చి 17 -- రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభ‌రోసా నిధులు జమ చేస్తారు.

రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే 28.02.2026 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఈనెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎక‌రం వ‌ర‌కు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద...