భారతదేశం, మార్చి 22 -- రైతులకు పెట్టుబడి సహాయం అందించే 'రైతు భరోసా' నిధులు ఇవాళ విడుదలకానున్నాయి. ఒక ఎకరం భూమి కలిగిన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.3,590 కోట్ల మొదటి విడత మొత్తాన్ని జమ చేస్తారు. సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిధుల విడుదల ఉంటుంది.

మ‌రో 20 రోజుల‌కు రూ.2,650 కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఏప్రిల్ నెలాఖ‌రులోగా మిగిలిన రైతులకు వారి ఖాతాల్లోకి బ‌దిలీ చేయ‌నున్నారు. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9 వేల కోట్లు రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి.

రెండు పంటల సీజన్లకు గాను ఎకరానికి రూ.6,000 చొప్పున నిధులు జమ చేయాలనే లక్ష్యంతో రూపొందించిన 'రైతు భరోసా' పథకంలో భాగంగా... ప్రభుత్వం మొత్తం రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో...