భారతదేశం, జూన్ 18 -- Telangana Registration Services : ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసే వారితో పాట రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎదురుచూస్తున్న సాధారణ ప్రజలకు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. శాఖకు సంబంధించిన ప్రధాన వెబ్‌సైట్‌తో పాటు దానికి అనుబంధంగా పనిచేసే అన్ని ఆన్‌లైన్ సేవలు ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని వెల్లడించింది. సర్వర్ల ఆధునీకీకరణ, షెడ్యూల్ చేసిన సాంకేతిక నిర్వహణ పనుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

రిజిస్ట్రేషన్ల శాఖలో దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ స్థాయి సర్వర్ నిర్వహణ పనులను అధికారులు చేపట్టనున్నారు. ఈ పనుల ద్వారా శాఖకు సంబంధించిన ఆన్‌లైన్ సర్వర్ వ్యవస్థలు భవిష్యత్తులో మరింత సజావుగా, ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా పనిచేస్తాయి. అంతేకాకుండా వి...