TG Ration Card eKYC Status : రేషన్ కార్డ్ e-KYC పూర్తి అయిందా..? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, జూలై 30 -- Telangana Ration Card eKYC Status : తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. పారదర్శకతను పెంచేందుకు, అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానాన్ని విధిగా చేపడుతోంది. ఈ నెలాఖరు నాటికి (జూలై 31) ప్రతి లబ్ధిదారుడు ఈ-కేవైసీ ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని సభ్యుల పేర్లను రేషన్ కార్డుల నుంచి అధికారులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో ఉచిత రేషన్ బియ్యం నిలిచిపోవడమే కాకుండా, రేషన్ కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రాతిపదికన ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని యంత్రాంగం కోరుతోంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.