భారతదేశం, ఆగస్టు 3 -- Telangana Ration Card eKYC : రాష్ట్రంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులందరికీ ప్రభుత్వం ముఖ్యమైన సూచన చేసింది. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరూ తమ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రేషన్ పంపిణీ వ్యవస్థలో పూర్తిస్థాయి పారదర్శకతను తీసుకురావడంతో పాటు, అనర్హులను తొలగించి కేవలం నిజమైన లబ్ధిదారులకు, అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది.

ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం. ఆగస్టు 31వ తేదీ నాటికి రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న కుటుంబ సభ్యులందరూ తమ ఈ-కేవైసీ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదురయ్యే అవ...