భారతదేశం, మే 18 -- TG POLYCET Key Results 2026 :తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టిజీ పాలిసెట్ (TG POLYCET-2026) రాసిన విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి (SBTET) పరీక్షకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీ (Preliminary Key)ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను ఈ కీతో సరిచూసుకోవచ్చు.

ఈ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టికల్చరల్ యూనివర్సిటీల పరిధిలోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

టీజీ పాలిసెట్ - 2026 ప్రాథమిక కీ విడుదల కావడంతో ఇక ఫలితాల విడుదలపై అధికారులు క...