భారతదేశం, మే 27 -- TG Polycet 2026 Counselling : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి(మే 27 ) నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రవేశాల కమిటీ సమగ్ర షెడ్యూల్‌ను విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటాతో కలిపి మొత్తం 18,788 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో కొత్తగా 4,200 సీట్లు పెరిగాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈసారి కొత్తగా 10 రకాల అత్యాధునిక కోర్సులను ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు 52 ప్రైవేట్‌ పాలిటెక్నిక్ కళాశాలల్లో 14,352 సీట్లు అందుబాటులో ఉన్నట్లు...