భారతదేశం, మే 31 -- TG POLYCET 2026 Counselling : టీజీ పాలిసెట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ సూచించింది.

పాలిసెట్ ర్యాంకు సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ( https://tgpolycet.nic.in ) ద్వారా ఆన్‌లైన్ వేదికగా ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత, తమ ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన (సర్టిఫికెట్ వెరిఫికేషన్) కోసం తేదీ, సమయం, హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఎంచుకుంటూ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.

ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని.. నిబంధనల ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన...