భారతదేశం, జూన్ 10 -- TG POLYCET 1st Phase Counselling 2026 : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ పాలిసెట్-2026' (TG POLYCET) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి విద్యార్థులకు సాంకేతిక విద్యాశాఖ ముఖ్యమైన సమాచారం అందించింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వివిధ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు పొందిన అభ్యర్థుల ఆన్‌లైన్‌ రిపోర్టింగ్‌ , ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది.

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో సీట్లు పొందిన అర్హులైన విద్యార్థులు ఈ నెల 11వ తేదీ (జూన్ 11) వరకు తమ ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించడంతో పాటు సంబంధిత వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిపోర్ట...