భారతదేశం, ఏప్రిల్ 1 -- తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థుల కోసం టీశాట్ డిజిటల్ పాఠాలను అందించనుంది. ఇవాళ్టి (ఏప్రిల్ 1) నుంచి ఈ పాఠాలు అందుబాటులోకి వస్తాయి.

శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మే 13వ తేదీన పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 1వ తేదీ నుంచి రోజుకు రెండు గంటల చొప్పున 42 రోజుల పాటు 84 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నట్లు టీశాట్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

మ్యాథ్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్స్ బోధించిన పాఠ్యాంశాలు విద్య ఛానల్ ( https://www.youtube.com/@TSATNetwork ) లో ఉంటాయి. సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు, రాత్రి తొమ్మిది నుండి 11 గంటల వరకు నిపుణ ఛానల్ లో పున: ప్రసారమౌతాయని టీశాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి...