భారతదేశం, ఏప్రిల్ 20 -- Telangana Polytechnic Entrance Exam 2026 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు టీజీ పాలిసెట్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ చివరి దశకు చేరింది.

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు నేటితో పూర్తవుతుంది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు లేదా ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న వారు ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు.

ఇంజినీరింగ్, నాన్-ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో చేరాలనుకునే వారు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జనరల్ విద్యార్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద...