భారతదేశం, జూన్ 20 -- TG POLYCET 2026 Seat Allotment : రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్‌ (POLYCET) చివరి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం రాత్రి ఈ సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం సీట్లలో నాలుగో వంతు అంటే.. దాదాపు 25 శాతం సీట్లు మిగిలిపోయాయి.

రాష్ట్రంలో మొత్తం 112 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఈడబ్ల్యూఎస్‌ (EWS) కోటాతో కలుపుకొని మొత్తం 33,535 సీట్లు ఉండగా... తాజా కౌన్సిలింగ్ ముగిసే సమయానికి 25,111 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. అంటే మొత్తం సీట్లలో 74.88 శాతం సీట్లు భర్తీ కాగా, ఇంకా 8,424 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి.

ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల వారీగా చూస్తే విద్యార్థులు సర్కారు కాలేజీల్లో చే...