భారతదేశం, జూన్ 5 -- TG PGECET 2026 Results : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. తెలంగాణ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGECET)-2026 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) అధికారికంగా విడుదల చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించి. తక్కువ సమయంలోనే ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ పీజీ ఈసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మరియు అనుబంధ కళాశాలల్లోని ఎంఈ , ఎంటెక్ (M.Tech), ఎంఫార్మసీ (M.Pharmacy), ఎంఆర్క్ (M.Arch), ఫార్మ్-డి (గ్రాడ్యుయేషన్ అనంతర కోర్సులు) వంటి పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. మే 29వ తేద...