భారతదేశం, ఆగస్టు 31 -- Telangana Cheyutha Pensions Applications : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'చేయూత' పథకం కింద కొత్త సామాజిక పింఛన్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నాటికే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.34 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు సోమవారమే(ఆగస్ట్ 31) చివరి రోజు కావడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీ నుంచి మొత్తం 5 వేర్వేరు కేటగిరీల్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇవాళ ఒక్కరోజే మిగిలి ఉన్న నేపథ్యంలో... మరో 50 వేల వరకు అప్లికేషన్లు రావొచ్చని అంచనా.

అందిన దరఖాస్తుల వివరాలను పరిశీలిస్తే.. సమాజంలో ఆర్థిక ఆసరా అవసరమైన విత...