భారతదేశం, ఏప్రిల్ 10 -- తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితంగా వైద్యారోగ్యశాఖలో కీలకమైన 2,322 నర్సింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఫలితాలకు సంబంధించిన వివరాలను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(MHSRB వెబ్ సైట్ లో ఉంచారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించిన తర్వాత.. రాత పరీక్షలను నిర్వహించారు. గతేడాది డిసెంబర్ లోనే 'ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్'ను రిలీజ్ చేశారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించారు. మిగతా ప్రక్రియలు కూడా పూర్తి కావటంతో. తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు.

నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారితో పాటు పరీక్ష రాసిన మిగిలిన అభ్యర్థుల మార్కులు, ఇతర వివరాలను అందుబాటులో ...