భారతదేశం, జూలై 6 -- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఓటరు హక్కును సాధించాలనుకునే యువతకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (CEO Telangana) కార్యాలయం ఒక కీలక సమాచారాన్ని విడుదల చేసింది. 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకున్న ప్రతి కొత్త ఓటరు కూడా ప్రస్తుతం ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనది కాబట్టి.. అర్హులైన యువతీయువకులు ఎవరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం "ఫాం 6" (Form 6) ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఫాం-6 దరఖాస్తుతో పాటు ఒక డిక్లరేషన్ ఫారాన్ని కూడా జతపరిచి ఎన్‌రోల్‌మెంట్ కోసం సమర్పించాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన ఖాళీ ఫారాలను మీ ప్రాంతంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) స్వయంగా ఉచితంగా అ...