భారతదేశం, ఫిబ్రవరి 18 -- రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఇక ప్రాదేశిక ఎన్నికలు(ఎంపీటీసీ, జెడ్పీటీసీ) జరగాల్సి ఉంది. సర్పంచ్ ఎన్నికలు పూర్తి కాగానే వెంటనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కుదరలేదు. ముందుగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించగా. ఇటీవలనే ప్రక్రియ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ప్రాదేశిక ఎన్నికలను కూడా పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది.
ఇక గతేడాదిలోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించింది. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది.
స్థానిక ఎన్నికలతో పాటు మున్సిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.