భారతదేశం, ఏప్రిల్ 10 -- TG Model School Hall Tickets 2026 : తెలంగాణ మోడల్‌ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఆరో తరగతి ఎంట్రెన్స్ తో పాటు 7వ తరగతి నుంచి పదో తరగతి ప్రవేశాలకు సంబంధించి హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది.

ఏప్రిల్ 19న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2026 జరగనుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్-మీడియం విద్యను అందించడానికి ఈ మోడల్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలు 6 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రాష్ట్ర సిలబస్‌తో పనిచేస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో...