భారతదేశం, మార్చి 9 -- తెలంగాణలో మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించారు. అయితే అప్లికేషన్ల గడువు దగ్గరపడింది. రేపటితో (మార్చి 10) దరఖాస్తుల ప్రక్రియ పూర్తవుతుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి.. ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి.మోడల్ స్కూల్ ప్రవేశ దరఖాస్తు ఫీజు కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ సీ విద్యార్థులు రూ. 125, ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి.

గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల విద్యార్థులకు ఉచ...