భారతదేశం, మార్చి 1 -- తెలంగాణలో మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఫిబ్రవరి 28వ తేదీతో అప్లికేషన్ల గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి.. ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ సీ విద్యార్థులు రూ. 125, ఓసీ విద్యార్థులు రూ. 200 ఫీజు చెల్లించాలి. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 19వ తేదీన రాష్ట్ర...