భారతదేశం, అక్టోబర్ 20 -- వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసేందుకు తెలంగాణ రక్షణ సేన సిద్ధమైంది. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ప్రకటన విడుదల చేశారు.

ఉద్యమకారుడు, డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను ఎమ్మెల్సీ బరిలో నిలుపుతున్నట్లు కవిత ప్రకటించారు. విజయదశమి దసరా పండుగ శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయాన్ని వెలువరించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగటం ఇదే తొలిసారి..!

ఈ ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా సమన్వయం చేసేందుకు తెలంగాణ రక్షణ సేన ముఖ్య నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో పార్టీ ఎన్నికల కో-ఆర్డినేషన్, ప్రచార పర్యవేక్షణ కోసం సీనియర్ నాయకుడు సయ...