భారతదేశం, నవంబర్ 8 -- Telangana Meeseva Pahani Services : తెలంగాణలోని రైతులకు, భూ యజమానులకు ప్రభుత్వం ఊరట కలిగించే వార్త అందించింది. ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పహాణి జారీ సేవలను మీసేవ కేంద్రాల ద్వారా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. భూ భారతి పోర్టల్ ద్వారా భూముల వివరాలు చూసుకునే వెసులుబాటు మాత్రమే ఉండటంతో, అధికారికంగా పహాణి కాపీలు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం గతంలో నిలిచిపోయింది.

ఫలితంగా వ్యవసాయ భూముల కొనుగోళ్లు, బ్యాంక్ రుణాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ట్రాన్సాక్షన్స్ సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజా నిర్ణయంతో మీసేవ కేంద్రాల ద్వారానే నేరుగా పహాణి కాపీని అధికారిక సర్టిఫికెట్‌గా పొందే సదుపాయం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ మీసేవ నిర్వాహకుల ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేస్తూ.. మంత్రి దుద్దిళ్ల శ్...