భారతదేశం, జూలై 5 -- తెలంగాణ లాసెట్ - 2026 రాసిన అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కోర్సు అయిన ఎల్‌ఎల్‌ఎం (LLM) లలో ప్రవేశాలు పొందాలనుకునే వాళ్లు. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు జూలై 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జూలై 10తోనే ఈ ఆన్‌లైన్ నమోదు(రిజిస్ట్రేషన్), ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ముగుస్తుందని అధికారులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ముందుగానే తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని సూచించారు.

కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు తమ లాసెట్ హాల్ ట...