భారతదేశం, జూన్ 4 -- TG LAWCET 2026 Results : తెలంగాణలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు ఎల్‌ఎల్‌ఎమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ (TG LAWCET), పీజీ లాసెట్ (TS PGLCET) ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో అధికారులు ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా చూసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా న్యాయశాస్త్ర కోర్సుల్లో చేరాలనే లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. లాసెట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యామండలి త్వరలోనే ప్రకటించనుంది. అర్హత సాధించిన విద్యార్థులకు వారి ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో సీట్లను కేటాయిస్త...