భారతదేశం, జూన్ 19 -- Telangana Land Resurvey 2026 : రాష్ట్రంలో భూసమస్యలు, భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ రీసర్వే నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశల వారీగా ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

శుక్రవారం రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ ప్రాజెక్టు పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి దశలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల నుంచి జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2,240 గ్రామాలను ఎంపిక చేసి రీసర్వే పన...