భారతదేశం, ఏప్రిల్ 20 -- తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును పొడిగిస్తున్నట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. నిజానికి ఏప్రిల్ 20వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు ఏప్రిల్ 23వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.

విద్యార్థులు వారు చదువుతున్న కాలేజీలోనే ఈ ఫీజును చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. టీజీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సంవత్సరం పరీక్షలు. మధ్యాహ్న...