భారతదేశం, ఏప్రిల్ 11 -- తెలంగాణ ఇంటర్ ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈనెల 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండియర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలను ఒకేసారి విడుదలవుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలను అందుబాటులో ఉంచుతామని బోర్డు తెలిపింది. ఇందుకోసం tgbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్ సైట్లను సంప్రదించాలని సూచించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగిన సంగతి తెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.