భారతదేశం, జూలై 2 -- TG Inter 1st Year Admissions 2026 : తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ వచ్చింది. ప్రథమ సంవత్సర అడ్మిషన్ల గడువును ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, కో-ఆపరేటివ్, గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు ఈ గడువు వర్తిస్తుంది.

మొదటి విడత అడ్మిషన్ల గడువు మంగళవారంతోనే ముగిసిపోయింది. అయితే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ బోర్డు.. ఈ గడువును నెలాఖరు వరకు అవకాశం కల్పించారు.

ఇటీవల పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు ఇంటర్‌లో చేరాల్సి ఉంది. వీరందరికీ తాజా నిర్ణయంతో కాలేజీల్లో దరఖాస్తు చేసుకునేందుకు తగిన స...