భారతదేశం, మార్చి 7 -- ఏప్రిల్ 1 నుంచి రెండోదశ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమం కానుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు. మొదటి దశలో రాష్ట్రమంతటా గ్రౌండింగ్ కాని (20 శాతం) లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనల మేరకు మార్చి 31 నాటికి లక్ష ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

ఈరోజు డా.బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి ప్రణాళిక లో భాగంగా హౌసింగ్ శాఖ 99 రోజుల్లో చేప‌ట్ట‌వ‌ల‌సిన కార్యాచ‌ర‌ణ‌పై జిల్లా హౌసింగ్ పీడీల‌తో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి మాట్లాడారు. ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇండ్ల పథకం అమ‌లు చేస్తోందన్నారు. ఈ ప‌థకం రాష్ట్ర చరిత్రలో ఒక బెంచ్ మార్క్‌గా నిల‌వ‌బోతోందని వ్యాఖ్యానించారు...