భారతదేశం, సెప్టెంబర్ 28 -- పేద కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయనుంది. అయితే ఈ స్కీమ్ కు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం వైద్య, సామాజిక భద్రత రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఆదివారం నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) ఆత్మీయ సమావేశంలో భట్టి మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని దగ్గర చేశామన్నారు. దీనికి కొనసాగింపుగా.. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక రక్షణ కల్పించే ఉద్దేశంతో ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ బీమా' పథకాన్ని నవంబర్ 19న అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇందిరా గాంధీ జయంతిని పుర...