భారతదేశం, మే 20 -- Telangana Indiramma Bima Scheme : రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. పేద కుటుంబాల్లో ఆకస్మికంగా సంభవించే విపత్తుల వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల భారీ జీవిత బీమా సదుపాయాన్ని ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా కల్పించబోతుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ బీమా వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం.. తెలంగాణవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.15 కోట్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ నూతన పథకం ద్వారా గరిష్ట ఆర్థిక భద్రత చేకూరనుంది. కుటుంబంలో సంపాదించే ముఖ్య వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబ...