భారతదేశం, మార్చి 20 -- తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర, మహబూబ్ నగర్ క్యాంపస్ లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతి పాస్ అయిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.

మార్చి 18వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు. మే 10వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ దరఖాస్తుల స్వీకరణ (పోస్ట్ ద్వారా) ప్రాసెస్ మే 20తో ముగుస్తుంది. ఎంపికైన వారి జాబితాను మే 30వ తేదీన ప్రకటిస్తారు.

జులై 4వ తేదీన ప్రొవిజనల్ లిస్ట్ ను ప్రకటిస్తారు. జూన్ 5 న ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు https://www.rgukt.ac.in/ లింక్ ద్వారా అప్లికేషన్...