భారతదేశం, జూలై 28 -- TG ICET 2026 Counseling Schedule : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఎంబీఏ , ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభవుతాయి. రెండు విడతల్లో నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తారు.

టీజీ ఐసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 31న ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన (ధ్రువపత్రాల పరిశీలన) ఉంటుంది. ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

ఆగస్టు 11వ తేదీ లేదా అంతకంటే ముందే మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.సీట్లు పొందే విద్యార్థులు.. ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు ఆయా కళా...