భారతదేశం, మే 9 -- TG ICET 2026 Hall Tickets : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఐసెట్‌ (TG ICET) 2026 పరీక్షకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. అభ్యర్థుల హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

కాకతీయ విశ్వవిద్యాలయం (వరంగల్) ఆధ్వర్యంలో ఈ ఏడాది ఐసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. మే 13, 14 తేదీల్లో పూర్తి చేస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. సెషన్ 3 పరీక్ష మే 14, 2026 న సింగిల్ షిఫ్ట్ లో జరుగుతుంది.

పరీక్షా కేంద్రానికి వెళ్లే ముందు అభ్యర్థులు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార...